ఆరోగ్యానికి అండ మన బెండకాయ ???హెల్త్ బెనిఫిట్స్ విత్ లేడీ ఫింగర్!!!! |
ఉపయోగాలు
1.మలబధ్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
2. బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
3.రక్తంలోని హానికారక కొలెస్టాల్ ను తగ్గించి హృదయ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది.
4.ఎసిడిటీ,గ్యాస్, అల్సర్ల బాధితులు పచ్చి బెండ తింటే ఆ జిగురు జీర్ణకోశానికి లోపల పొరగా ఏర్పడి ఉపశమనం కలుగుతుంది.
5. మూత్ర సంబంధిత, మూత్రాశయ నాళపు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. మూత్రం సాఫీగా వస్తుంది.
6.జ్వరం బాధితులు బెండ ముక్కలు వేసి కాచిన నీటిని చల్లబరిచి తాగితే జ్వరం తగ్గుతుంది.
7.మధుమేహులు గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచి లేవగానే ముక్కలు తీసి ఆ నీటిని తాగాలి. ఇలాచేస్తే 2 వారాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
8.తరచూ బెండకాయ తినేవారిలో మెదడు పనితీరు బాగుంటుంది. మానసిక సమస్యలు దరిజేరవు.
9.బెండకాయలోని ఫోలిక్ ఆమ్లం అటు గర్భిణులకు, శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధికి ఇతోధికంగా మేలు చేస్తుంది.
10.బెండలోని కాల్షియం, విటమిన్ -సి వల్ల ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది. కండరాలను, ఎముకలను పట్టి ఉంచే సున్నితమైన కణజాలం బలపడుతుంది.
పోషకాల వివరాలు (ప్రతి 100 గ్రాములకు)
పిండి పదార్థాలు - 6.4 శాతం
మాంసకృత్తులు - 1.9 శాతం
కొవ్వు - 0.2 శాతం
పీచు - 1.2 శాతం
ఖనిజ లవణాలు - 0.7 శాతం
సున్నం - 66 మి.గ్రా
భాస్వరం - 56 మి.గ్రా
ఇనుము - 0.30 మి.గ్రా
విటమిన్ సి - 13 మి.గ్రా.
మెగ్నీషియం - 53 మి.గ్రా.
సోడియం - 6.9 మి.గ్రా.
పొటాషియం - 103 మి.గ్రా
కాపర్ - 113 మి.గ్రా.
మాంగనీస్ - 149 మి.గ్రా
జింక్ - 417 మి.గ్రా
మరి కొన్ని ఉపయోగాల కోసం .....
ఇంకా టిప్స్ కోసం మన పేస్ బుక్ పేజీ (FaceBook Page) ని లైక్ (LIKE)చేయండి......
# గమనిక #
No comments:
Post a Comment