December 22, 2016

ఆరోగ్యానికి అండ .. మన బెండకాయ ??? బెండకాయ వలన ఉపయోగాలు!!!!

ఆరోగ్యానికి అండ మన బెండకాయ ???హెల్త్ బెనిఫిట్స్ విత్ లేడీ ఫింగర్!!!!
అమ్మాయి చేతి వేళ్ళలా నాజూ గా ఉండే కూరగాయ బెండకాయ.బెండకాయ  ను ఇష్టపడనివారుండరు .విందు ఏదైనా బెండకాయ వంటకం ఉండాల్సిందే. ఆకట్టుకొనే రంగు,కమ్మని రుచి దీని ప్రత్యేకతలు. బెండలోని యాంటీ ఆక్సీడెంట్లు, పీచు, ఇతర పోషకాలు, ఆరోగ్య పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. బెండలోని  ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేసి నాడీవ్యవస్థను చురుగ్గా పనిచేయిస్తాయి. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.

 ఉపయోగాలు

1.మలబధ్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

2. బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

3.రక్తంలోని హానికారక కొలెస్టాల్ ను తగ్గించి హృదయ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది.

4.ఎసిడిటీ,గ్యాస్, అల్సర్ల బాధితులు పచ్చి బెండ తింటే ఆ జిగురు జీర్ణకోశానికి లోపల పొరగా ఏర్పడి ఉపశమనం కలుగుతుంది.

5. మూత్ర సంబంధిత, మూత్రాశయ నాళపు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. మూత్రం సాఫీగా వస్తుంది.

6.జ్వరం బాధితులు బెండ ముక్కలు వేసి కాచిన నీటిని చల్లబరిచి తాగితే జ్వరం తగ్గుతుంది.

7.మధుమేహులు గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచి లేవగానే ముక్కలు తీసి ఆ నీటిని తాగాలి. ఇలాచేస్తే 2 వారాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

8.తరచూ బెండకాయ తినేవారిలో మెదడు పనితీరు బాగుంటుంది. మానసిక సమస్యలు దరిజేరవు.

9.బెండకాయలోని ఫోలిక్ ఆమ్లం అటు గర్భిణులకు, శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధికి ఇతోధికంగా మేలు చేస్తుంది.

10.బెండలోని కాల్షియం, విటమిన్ -సి వల్ల ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది. కండరాలను, ఎముకలను పట్టి ఉంచే సున్నితమైన కణజాలం బలపడుతుంది.

పోషకాల వివరాలు (ప్రతి 100 గ్రాములకు)

పిండి పదార్థాలు    -     6.4 శాతం

మాంసకృత్తులు    -    1.9 శాతం

కొవ్వు               -     0.2 శాతం

పీచు                -      1.2 శాతం

ఖనిజ లవణాలు   -     0.7 శాతం

సున్నం             -      66 మి.గ్రా

భాస్వరం            -      56 మి.గ్రా

ఇనుము              -     0.30 మి.గ్రా

విటమిన్ సి           -    13 మి.గ్రా.

మెగ్నీషియం         -    53 మి.గ్రా.

సోడియం             -    6.9 మి.గ్రా.

పొటాషియం          -    103 మి.గ్రా

కాపర్                 -     113 మి.గ్రా.

మాంగనీస్‌            -     149 మి.గ్రా

జింక్‌                  -     417 మి.గ్రా

మరి కొన్ని ఉపయోగాల కోసం .....

ఇంకా టిప్స్  కోసం మన  పేస్ బుక్ పేజీ (FaceBook Page)  ని లైక్ (LIKE)చేయండి......

                                                     # గమనిక #

ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

October 28, 2016

ఈ అయిదు పదార్థాలను అసలు మళ్లీ మళ్లీ వేడి చేసి.. తినకూడదా !

https://telugumomstips.blogspot.com

మన ఇంటికి భోజనానికి అతిధులు వస్తే మనకి వచ్చిన రకరకాల వంటలు చేస్తాం వచ్చిన వాళ్ళు తృప్తిగా తినాలి అని అలా చేసిన వంటల్లో చాలా వరకు మిగిలిపోతాయి వాటిని మనం ట్రాష్ లో వేయకుండా మన లో చాలా మంది రాత్రి మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి.. మర్నాడు వేడి చేసుకుని తింటారు. కొన్ని పదార్థాలను ఇలా చేయొచ్చు కానీ.. అన్నీ కాదు. ముఖ్యంగా ఈ కింది పదార్థాలను అసలు వేడిచేయకూడదు.

ఈ పదార్థాలను అసలు  మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూదదు !

1.బచ్చలికూర: ఇందులో ఇనుము, నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో ఇందులో ఉండే మంచి పోషకాలు కాస్తా హానిచేసేవిగా మారిపోతాయి. వాటి ప్రభావం శరీరంలోని అవయవాల మీద పడుతుంది. ఒకవేళ వేడిగా కావాలనుకుంటే బాగా మరిగిన నీళ్లలో ఈ కూర గిన్నెను కాసేపు ఉంచి తరవాత తినొచ్చు.

2.గుడ్లు: ఉడికించిన గుడ్డు కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం వల్ల దానిలోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడిచేసిన గుడ్డు పదార్థాలు తినకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి.

3.చికెన్‌: ఇందులోని మాంసకృత్తులు మళ్లీ వేడిచేయడం వల్ల పోతాయి. జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

4.బంగాళాదుంపలు: ఈ కూరను వేడి చేయడం వల్ల దానిలో పోషక విలువలు నశిస్తాయి. వేడి చేయడం వల్ల విషపదార్థాలు శరీరంలోకి చేరిపోయి.. రకరకాల సమస్యలకు దారితీస్తాయి.

5.పుట్టగొడుగులు: మాంసకృత్తులు పుష్కలంగా అందించేవాటిల్లో ఇదీ ఒకటి. వండిన తరవాత మళ్లీ వేడి చేస్తే వీటిలోని మాంసకృత్తులు విషపూరితమవుతాయి. అనారోగ్యాలు వస్తాయి.

వీటిని ఎప్పుడయినా సరే కావల్సినంత మోతాదులోనే చేసుకోవాలి.ఎక్కువ ఎక్కువ గా చేసుకొన్ని తిరిగి వేడి చేసుకొన్ని తిన వద్దు అని మనవి .

మరి కొన్ని హెల్త్ టిప్స్ మీ కోసం  .......

image source :  http://bit.ly/2dPD5Y8

ఇంకా టిప్స్  కోసం మన  పేస్ బుక్ పేజీ (FaceBook Page)  ని లైక్ (LIKE)చేయండి......

                                                     # గమనిక #

http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

October 25, 2016

చుండ్రు సమస్యా ?చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు! హోం రెమెడీస్

 చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు 

మన శరీరానికి కి సహజం గా అందం ఇచ్చేది కేశాలు. ఈ రోజులో కేశాల ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బదీసే వాటిలో  చుండ్రు ప్రధానమైనది. వాతావరణ కాలుష్యం మూలంగా తలమీద చేరిన దుమ్ము, ధూళి, ఎండ కారణంగా పట్టే చెమట వంటివి ఈ చుండ్రుకు ప్రధాన కారణాలు.మన తల శుభ్రత కూడా ఒక్క కారణం . మరియు వానాకాలంలో తరచూ తడవటం, చల్లని వాతావరణంలో తిరగాల్సి రావటంతో ఈ సీజన్లో చుండ్రు సమస్య మామూలు కంటే కొంచెం ఎక్కువ గా ఉంటుంది .
చుండ్రు వలన కలిగే ఇబ్బందులు:

చుండ్రు కారణంగా దురద, చీకాకుతో బాటు జుట్టు రాలటం వంటి ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు షాంపూల వంటి ప్రత్యామ్నాయాల కంటే గృహవైద్యమే మంచిది. చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

చుండ్రు నివారణ , చికిత్స కు హోం రెమెడీస్ :
  • పావులీటరు కొబ్బరి నూనెలో గుప్పెడుమందార పువ్వులేసి మరగబెట్టి చల్లార్చి తలకు రాసుకుంటే జుట్టు రాలటం ఆగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిజేరదు.
  • అరకప్పు చొప్పున వేపాకు రసం, పెరుగు కలిపి అందులో చెంచా నిమ్మరసం వేసి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.
  • గుప్పెడు మెంతుల పొడి, చెంచా నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తలకు పట్టించి గంటపాటు ఆరనిచ్చి తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
  • గోరింటాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు, జుట్టు కుదుళ్లను బలపరచేందుకు, చుండ్రు, జుట్టు రాలటాన్ని ఆపేందుకు మంచి మందు .
  • కుంకుడుగాయలు కొట్టి వేడినీళ్లలో వేసి, గుప్పెడు పచ్చి మందారం ఆకుల్ని కలిపి తల స్నానం చేస్తుంటే చుండ్రు వదిలి పోవటమే గాక తెల్ల వెంట్రుకల సమస్యా తగ్గుముఖం పడుతుంది.
  • అరలీటరు నీటిలో 20 ముద్ద మందార పువ్వులు వేసి 100 మిల్లీలీటర్లకు మరగనిచ్చి, ఆరిన తర్వాత వడపోసి, వారంపాటు రోజుకు చెంచా చొప్పున పేనుకొరికిన దగ్గర మర్దన చేసి తలస్నానం చేస్తే కొత్త వెంట్రుకలు వస్తాయి. 
మరికొన్ని బ్యూటీ టిప్స్ & హెయిర్ కేర్ టిప్స్  

ఇంకా టిప్స్  కోసం మన  పేస్ బుక్ పేజీ (FaceBook Page)  ని లైక్ (LIKE)చేయండి......

                                                               # గమనిక #

ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

ఫ్రీ వెబ్ హోస్టింగ్ ??

ఫ్రీ వెబ్ హోస్టింగ్ 
మనలో చాలా మందికి  సొంత వెబ్ సైట్ తయారు చేసుకోవాలి అని ఉంటది.దానికోసం  మన కి డొమైన్ నేమ్ మరియు హోస్టింగ్ అవసరం ఉంటుంది .మనకి వెబ్ సైట్ తయారుచేసుకోవటం తెలుసు ,డొమైన్ నేమ్ కూడా ఏది బాగుంటుందో అనుకున్నాం .డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవటానికి మరియు మన వెబ్ సైట్ డేటా స్టోర్ చేసుకోవటానికి  హోస్టింగ్ కి  మనం కొంత ఖర్చు చేయలిసి ఉంటుంది .అసలే కొత్త ముందే డబ్బులు పెడితే ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది దానికోసం మనం ఎవరు అన్నా ఫ్రీ గా ఆఫర్ చేస్తే బాగా నేర్చుకున్న తరువాత డబ్బులు పెట్టవచ్చు అనుకుంటునారా అయేతే ఈ http://bit.ly/2epQcQV ఈ  లింక్ ద్వార మీరు రిజిస్టర్ అయితే ఫ్రీగా  డొమైన్ నేమ్ వాళ్ళ వెబ్ సైట్ అడ్రస్ తో ఇస్తారు  మరియు  వెబ్ హోస్టింగ్ ని ఇస్తారు .దీని ద్వార మన వెబ్ సైట్ ఆన్ లైన్ లో వస్తుంది చాలా బాగుంది కదా ట్రై చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి .ధన్యవాదాలు .

ఇంకా టిప్స్  కోసం మన  పేస్ బుక్ పేజీ (FaceBook Page)  ని లైక్ (LIKE)చేయండి......

                                                               # గమనిక #

ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

పెరుగు తో బ్యూటీ టిప్స్

ప్రతీ ఇంటిలో పెరుగును ఆహారం లో తప్పక తీసుకుంటారు.మనలో చాలా మందికి  పెరుగు లేకుండా భోజ‌నం సంపూర్ణమైనట్లు అనిపించదు.బలవర్ధకమైన ఆహారాల్లో పెరుగు ఒకటి.రుచికి అద్భుతంగా ఉండే పెరుగు రోగనిరోధక శక్తిని  పెంచి చక్కని ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే పెరుగు అన్ని వయసుల వారూ తీసుకోదగిన ఆహారం. ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య కి  పెరుగు అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో బ్యూటీ టిప్స్ ....
  • రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. చలికాలంలో పోడూరి చర్మం గలవారికి ఇదెంతో మేలుచేస్తుంది.
  • ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన చర్మానికి పెరుగు రాస్తే చర్మం పూర్వస్థితిని పొందుతుంది.
  • పెరుగులోని బ్యాక్టీరియా చర్మ సమస్యలు రాకుండా చూస్తాయి.
  • కప్పు పెరుగులో 2 చెంచాల నిమ్మరసం కలిపి రంగరించి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసి మర్దన చేస్తే కాలుష్యం, దుమ్ము కారణంగా ముఖం మీద చేరి పేరుకుపోయిన మలినాలు, వ్యర్ధాలు, మృతకణాలు తొలగిపోతాయి.
  • మొటిమలపై పెరుగు, శెనగ పిండి మిశ్రమం కలిపి తరచూ రాయటం వల్ల ముఖం మీద జిడ్డు తగ్గి మొటిమల బెడద తగ్గుతుంది.
  • చెంచాడు మెంతులు లేదా 2 చెంచాల ఉసిరికాయ పొడి పెరుగులో రాత్రంతా నానబెట్టితల స్నానానికి గంట ముందుగా తలకి రాసి మరో గంట తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు సమూలంగా తొలగిపోతుంది.
  • ఒక తమలపాకుని పెరుగులో 2 గంటలు నానబెట్టి అలసిన కళ్లపై ఉంచుకుంటే వేడి తొలగితాజాగా కనిపిస్తాయి.
  • చెంచా చొప్పున సెనగపిండి, పెసర పిండి, తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి రుద్దుకొంటే దుమ్ము, ధూళి తో పాటు మృతకణాలు తొలగి చర్మం సుతారంగా మారుతుంది.
  • పావుకప్పు చొప్పున పెరుగు, కలబంద గుజ్జు,చెంచాచొప్పున సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మిశ్రమంగా చేసుకొని దానిని ముఖానికి బాగా పట్టించి మర్దన చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో కడుక్కొంటే ముఖం కాంతివంతమవుతుంది. 
మరికొన్ని బ్యూటీ టిప్స్...... 