ప్రతీ ఇంటిలో పెరుగును ఆహారం లో తప్పక తీసుకుంటారు.మనలో చాలా మందికి పెరుగు లేకుండా భోజనం సంపూర్ణమైనట్లు అనిపించదు.బలవర్ధకమైన ఆహారాల్లో పెరుగు ఒకటి.రుచికి అద్భుతంగా ఉండే పెరుగు రోగనిరోధక శక్తిని పెంచి చక్కని ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే పెరుగు అన్ని వయసుల వారూ తీసుకోదగిన ఆహారం. ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య కి పెరుగు అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతో బ్యూటీ టిప్స్ ....
పెరుగుతో బ్యూటీ టిప్స్ ....
- రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. చలికాలంలో పోడూరి చర్మం గలవారికి ఇదెంతో మేలుచేస్తుంది.
- ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన చర్మానికి పెరుగు రాస్తే చర్మం పూర్వస్థితిని పొందుతుంది.
- పెరుగులోని బ్యాక్టీరియా చర్మ సమస్యలు రాకుండా చూస్తాయి.
- కప్పు పెరుగులో 2 చెంచాల నిమ్మరసం కలిపి రంగరించి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసి మర్దన చేస్తే కాలుష్యం, దుమ్ము కారణంగా ముఖం మీద చేరి పేరుకుపోయిన మలినాలు, వ్యర్ధాలు, మృతకణాలు తొలగిపోతాయి.
- మొటిమలపై పెరుగు, శెనగ పిండి మిశ్రమం కలిపి తరచూ రాయటం వల్ల ముఖం మీద జిడ్డు తగ్గి మొటిమల బెడద తగ్గుతుంది.
- చెంచాడు మెంతులు లేదా 2 చెంచాల ఉసిరికాయ పొడి పెరుగులో రాత్రంతా నానబెట్టితల స్నానానికి గంట ముందుగా తలకి రాసి మరో గంట తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు సమూలంగా తొలగిపోతుంది.
- ఒక తమలపాకుని పెరుగులో 2 గంటలు నానబెట్టి అలసిన కళ్లపై ఉంచుకుంటే వేడి తొలగితాజాగా కనిపిస్తాయి.
- చెంచా చొప్పున సెనగపిండి, పెసర పిండి, తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి రుద్దుకొంటే దుమ్ము, ధూళి తో పాటు మృతకణాలు తొలగి చర్మం సుతారంగా మారుతుంది.
- పావుకప్పు చొప్పున పెరుగు, కలబంద గుజ్జు,చెంచాచొప్పున సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మిశ్రమంగా చేసుకొని దానిని ముఖానికి బాగా పట్టించి మర్దన చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో కడుక్కొంటే ముఖం కాంతివంతమవుతుంది.
మరికొన్ని బ్యూటీ టిప్స్......
# గమనిక #
ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.
ఇంకా టిప్స్ కోసం మన పేస్ బుక్ పేజీ (FaceBook Page) ని లైక్ (LIKE)చేయండి......
# గమనిక #
ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.
test comment
ReplyDelete