https://telugumomstips.blogspot.com |
మన ఇంటికి భోజనానికి అతిధులు వస్తే మనకి వచ్చిన రకరకాల వంటలు చేస్తాం వచ్చిన వాళ్ళు తృప్తిగా తినాలి అని అలా చేసిన వంటల్లో చాలా వరకు మిగిలిపోతాయి వాటిని మనం ట్రాష్ లో వేయకుండా మన లో చాలా మంది రాత్రి మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి.. మర్నాడు వేడి చేసుకుని తింటారు. కొన్ని పదార్థాలను ఇలా చేయొచ్చు కానీ.. అన్నీ కాదు. ముఖ్యంగా ఈ కింది పదార్థాలను అసలు వేడిచేయకూడదు.
ఈ పదార్థాలను అసలు మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూదదు !
1.బచ్చలికూర: ఇందులో ఇనుము, నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో ఇందులో ఉండే మంచి పోషకాలు కాస్తా హానిచేసేవిగా మారిపోతాయి. వాటి ప్రభావం శరీరంలోని అవయవాల మీద పడుతుంది. ఒకవేళ వేడిగా కావాలనుకుంటే బాగా మరిగిన నీళ్లలో ఈ కూర గిన్నెను కాసేపు ఉంచి తరవాత తినొచ్చు.
2.గుడ్లు: ఉడికించిన గుడ్డు కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం వల్ల దానిలోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడిచేసిన గుడ్డు పదార్థాలు తినకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి.
3.చికెన్: ఇందులోని మాంసకృత్తులు మళ్లీ వేడిచేయడం వల్ల పోతాయి. జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
4.బంగాళాదుంపలు: ఈ కూరను వేడి చేయడం వల్ల దానిలో పోషక విలువలు నశిస్తాయి. వేడి చేయడం వల్ల విషపదార్థాలు శరీరంలోకి చేరిపోయి.. రకరకాల సమస్యలకు దారితీస్తాయి.
5.పుట్టగొడుగులు: మాంసకృత్తులు పుష్కలంగా అందించేవాటిల్లో ఇదీ ఒకటి. వండిన తరవాత మళ్లీ వేడి చేస్తే వీటిలోని మాంసకృత్తులు విషపూరితమవుతాయి. అనారోగ్యాలు వస్తాయి.
వీటిని ఎప్పుడయినా సరే కావల్సినంత మోతాదులోనే చేసుకోవాలి.ఎక్కువ ఎక్కువ గా చేసుకొన్ని తిరిగి వేడి చేసుకొన్ని తిన వద్దు అని మనవి .
మరి కొన్ని హెల్త్ టిప్స్ మీ కోసం .......
image source : http://bit.ly/2dPD5Y8
ఇంకా టిప్స్ కోసం మన పేస్ బుక్ పేజీ (FaceBook Page) ని లైక్ (LIKE)చేయండి......
# గమనిక #
ఈ http://telugumomstips.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://telugumomstips.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment